అమెరికాలో ఆ మాట చెప్పి.. ఇక్కడేమో ఈ చేతలా?
మహారాష్ట్రలో జరిగిన పరిణామాలపై రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ తీవ్రస్థాయిలో ప్రధాని మోదీ వైఖరిని తప్పుపట్టారు. ప్రధాని మోదీ ఇటీవలే అమెరికా చట్టసభల సంయుక్త సమావేశంలో మాట్లాడుతూ భారతదేశం ప్రజాస్వామ్య మాతృక అని తెలిపారని, అయితే ఆయన చెప్పిన మాతృత్వ నమూనా ఇదేనా అని సిబల్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో స్వచ్ఛమైన రాజకీయాలు కీలకం. దీనితో ఏ దేశమైనా ప్రజాస్వామ్య ప్రక్రియకు ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. అయితే పార్టీల్లో చీలికలు సృష్టించి సొంతపార్టీని బలోపేతం చేసుకోవడం ఎటువంటి ప్రజాస్వామ్య ప్రక్రియ అవుతుందో మోదీ జవాబు చెప్పాల్సి ఉందన్నారు. ఇతర ఎన్సిసి నేతలతో కలిసి అజిత్ పవార్ మహారాష్ట్ర ప్రభుత్వంలో వాలిపోవడం గురించి సిబల్ మాట్లాడారు. ప్రధాని మోదీ చెప్పే ప్రజాస్వామ్యం అంటే ఇదనా అని ప్రశ్నించారు.













