అయోధ్య శ్రీబాల రాముడిని దర్శించుకున్న ఈటల రాజేందర్

మాజీ మంత్రి, మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అయోధ్య శ్రీబాల రాముడిని దర్శించుకున్నారు. బాల రాముడికి ఈటల రాజేందర్ పూజలు నిర్వహించారు. అనంతరం సమీపంలోని మనుమాన్ ఘడి ఆలయాన్ని ఆయన సందర్శించారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కార్యదర్శి గోపాల్‌జీ కలిసిన ఈటల అయోధ్య ఆలయ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నృత్య గోపాల్ దాస్‌ను ఈటల రాజేందర్ సత్కరించారు. ఈటల రాజేందర్‌తో పాటు ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్, బీజేపీ నాయకులు గిరివర్దన్ రెడ్డి, ఆనంద్ కృష్ణ, గంగాధర్ గౌడ్, తిరుపతి యాదవ్ అయోద్య బాలరాముని దర్శించుకున్నారు.