రాజ్యసభ ఎన్నికలకు మోగిన నగారా
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశంలో మరో ఎన్నికల సమరానికి నగారా మోగింది. ఏప్రిల్లో ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానాలకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది సభ్యుల ఎంపికకు షెడ్యూల్ ఖరారు చేసింది. ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నిలకు నోటిఫికేష్ విడుదల కానుంది. ఫిబ్రవరి 15వ తేదీన నామినేషన్లకు దాఖలు చేయాల్సి ఉంటుంది. నామినేషన్ల పరిశీలనకు ఫిబ్రవరి 16 తేదీగా నిర్ణయించారు. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ జరగనుంది. తెలంగాణలో మూడు, ఆంధ్రప్రదేశ్లో మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.













