నావికుల కుటుంబాలకు కేంద్రం గుడ్ న్యూస్
చైనాలో చిక్కుకుపోయిన నావికుల కుటుంబాలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. అక్కడ చిక్కుకుపోయిన 18 మంది నావికులు ఈ నెల 14న భారత్కు తిరిగి చేరుకుంటారని కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఈ రోజు జపాన్ నుంచి బయల్దేరిన వారంతా ఆదివారం స్వదేశానికి చేరుకొని వారి కుటుంబ సభ్యులను కలవబోతున్నారని తెలిపారు. గతేడాది సెప్టెంబర్లో చైనాకు వెళ్లిన కార్గో నౌక ఎంవీ అనస్తాసియా 18 మంది సిబ్బందితో చైనా తీరంలో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. అయితే, ఈ నావికా సిబ్బంది జపాన్లో ఈరోజు బయల్దేరినట్టు కేంద్ర పోర్టుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఈ నావికులందరినీ భారత్కు తిరిగి పంపపడంలో కృషి చేసిన చైనాలో భారత రాయబార కార్యాలయాన్ని, ప్రయాణానికి ఏర్పాట్లు చేసిన మెడిటేరియన్ షిప్ కంపెనీని ప్రశంసించారు.













