క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్‌కు మరోసారి ఈడీ నోటీసులు!
థాయ్‌ల్యాండ్‌లో గ్యాంబ్లింగ్ చేస్తూ పట్టుపడిన క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్‌కు మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో మే నెల 15న తమ ముందు విచారణకు హాజరుకావాలని ఈ నోటీసుల్లో స్పష్టం చేశారు. కొన్నిరోజుల క్రితం థాయ్‌ల్యాండ్‌లో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తూ ప్రవీణ్ పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు కొత్తగా మరోసారి ఈడీ నోటీసులు అందాయి. ఫెమా నిబంధనలను ఉల్లంఘించిన ప్రవీణ్ గ్యాంబ్లింగ్ నిర్వహించినట్లు ఈడీ కేసు నమోదు చేసింది. ప్రవీణ్‌తో పాటు సంపత్, మాధవరెడ్డిలకు కూడా ఈ కేసులో ఈడీ నోటీసులు పంపింది. కొన్ని రోజుల క్రితం కూడా ప్రవీణ్‌ను ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే.













