ఎయిమ్స్ డైరెక్టర్‌గా శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఏఐఐఎంఎస్) నూతన డైరెక్టర్‌గా ఎం శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని క్యాబినెట్ అపాయింట్మెంట్ కమిటీ శ్రీనివాస్‌ను దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆయన 65 సంవత్సరాలు వచ్చే వరకు ఎయిమ్స్ డైరెక్టర్‌గా కొనసాగనున్నారు. ఇంతకు ముందు శ్రీనివాస్ హైదరాబాద్ సనత్‌నగర్‌లోని ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ కంపెనీ (ఈఎస్ఐసీ) హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజీలో డీన్‌గా పని చేస్తున్నారు. డాక్టర్ శ్రీనివాస్ గతంలో ఢిల్లీ ఎయిమ్స్‌లోని పీడియాట్రిక్ సర్జరీ విభాగంలోనూ సేవలందించారు. ఈ సందర్బంగా ఆయనకు ఎయిమ్స్ వైద్యులు శుభాకాంక్షలు తెలిపారు.













