అంతర్జాతీయ విమానాల పునరుద్ధరణపై.. డీజీసీఏ కీలక ప్రకటన
దేశంలో అంతర్జాతీయ విమానాల పున: ప్రారంభంపై కరోనా వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావం చూపింది. ఈ నెల 15న నిర్ణయించిన అంతర్జాతీయ విమానాల పునరుద్ధరణ వాయిదా పడింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీసీసీఏ) ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రపంచ దృష్టాంతాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని వర్గాలతో సంప్రదించి ఒమిక్రాన్ వేరియంట్ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాం. ఈ నేపథ్యంలో షెడ్యూల్ చేసిన వాణిజ్య అంతర్జాతీయ ప్రయాణికుల సేవలను తిరిగి ప్రారంభించే తేదీపై తగిన నిర్ణయం తీసుకుంటాం. కొత్త షెడ్యూల్ తేదీని నిర్ణీత సమయంలో తెలియజేస్తాం అని పేర్కొంది.













