కేజ్రీవాల్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ
అరవింద్ క్రేజీవాల్ సారధ్యంలోని ఢిల్లీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వివాదాస్పద ఢిల్లీ ఎక్సైజ్ పాలసీపై సీబీఐ దర్యాప్తునకు ఢిల్లీ లెఫ్టినెంట్ గరవ్నర్ వీకే సక్సేనా ఆదేశించారు. ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నివేదిక ఆధారంగా ఎల్జీ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. టెండర్లు ఖరారైన తర్వాత లిక్కర్ లైసెన్సుల మంజూరులో అనుచిత లబ్ధి చేకూర్చడంలో ప్రభుత్వ ఖజానాకు భారీ గండి పడిరదని కేజ్రీవాల్ ప్రభుత్వంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. 2021`22లో లిక్కర్ లైసెన్సుదారులకు అనుచిత ప్రయోజనాలు వర్తింపచేయడంలో నిబంధనలు ఉల్లంఘించారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లెఫ్టినెంట్ గవర్నర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌లకు పంపిన నివేదిక అనంతరం ఎల్జీ మద్యం పాలసీపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు.













