అమెరికా రక్షణ మంత్రితో రాజ్నాథ్ సింగ్ భేటీ
భారత్, అమెరికా రక్షణ సంబంధాల్లో సరికొత్త అంకానికి తెరలేవబోతోంది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బేసిక్ ఎక్స్ఛేంజ్ అండ్ కో ఆపరేషన్ అగ్రిమెంట్ (బెకా) ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేయనున్నాయి. అత్యాధునిక సైనిక సాంకేతికత, వసతి కేంద్రాలతో పాటు అంతరిక్ష పరిజ్ఞాన సంబంధిత పటాలను పరస్పరం వినియోగించుకునేందుకు ఈ ఒప్పందం వీలు కల్పించనుంది. ఢిల్లీ వేదికగా నేడు 2+2 చర్చల్లో ఇరు దేశాల ప్రతినిధులు బైకా పై సంతకాలు చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్సర్ మధ్య జరిగిన భేటీలో ఈ మేరకు అంగీకారం కుదిరినట్లు వెల్లడించాయి. ప్రతిష్ఠాత్మక 2+2 చర్చల్లో పాల్గొనేందుకు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, ఎస్సర్ భారత్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా రాజ్నాథ్తో ఎస్పర్ సమావేశమయ్యారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పరస్పర సహకారాన్ని పెంచుకోవడం పైనా మంతనాలు జరిపారు.













