కరోనా జాబితాలో.. మరో కొత్త లక్షణం

రుచి కోల్పోవటం నుంచి తల వెంట్రుకలు ఊడిపోవటం వరకూ కరోనా లక్షణాలు ఎన్నో ఉన్నాయి. ఈ జాబితాలో మరో కొత్త లక్షణం కూడా వచ్చి చేరింది. చేతివేళ్లు, కాలివేళ్లకు ఉండే గోళ్లపై వచ్చే మార్పులు కూడా కరోనా లక్షణాలేనని.. అయితే ఇవి వైరస్ పై పోరాడి దాన్నించి బయటపడిన తర్వాత కనిపిస్తాయని కొందరు పరిశోధకులు అంటున్నారు. గోళ్లపై తెల్లటి గీతలు ఏర్పడటం, పగుళ్లు రావటం వంటివి కరోనా నుంచి కోలుకున్న తర్వాత కొందరిలో బయటపడుతున్నాయన్నారు.