కరోనాబారిన పడ్డ క్రికెటర్లు…ఐపిఎల్ కు దెబ్బ

ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్ 2021 సీజన్ పూర్తిగా జరిగేలా కనిపించడంలేదు. కరోనా మహమ్మారి క్రికెటర్లను కూడా వదలడం లేదు. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ క్రికెటర్లకు కరోనా రావడంతో ఆటగాళ్ళు ఇబ్బందులకు గురవుతున్నారు. కోల్‍కతా నైట్‍రైడర్స్ టీమ్‍లో చాలా మంది ఆటగాళ్లు అస్వస్థతకు గురయ్యారు. అంతేకాకుండా ఆటగాళ్లలో కరోనా లక్షణాలు కనిపించడంతో ఉలిక్కపడ్డ ఫ్రాంఛైజీ సదరు ప్లేయర్స్ను ఐసోలేషన్‍కు తరలించింది. స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్తో సహా వరుణ్ చక్రవర్తి వంటి పలువురు ఆటగాళ్లు కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. దీంతో సోమవారం ఆర్‍సీబీతో జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది. అత్యంత సురక్షితమైన బయో బబుల్‍లో ఈ లీగ్ జరుగుతుండగా.. కేకేఆర్ ఆటగాళ్లు అస్వస్థతకు గురవ్వడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ?కరోనా వల్ల ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్ సజావుగా పూర్తవుతుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే.