వయనాడ్ కు రాహుల్ రాజీనామా

కేరళలోని వయనాడ్ లోక్‌సభ సభ్యత్వానికి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. ఎన్నికైన 14 రోజుల్లోగా రాజీనామా చేయాలనే నిబంధనను అనుసరించి వయనాడ్‌ను వదులుకున్నారు. రాయ్‌బరేలీ ఎంపీగా ఆయన కొనసాగనున్నారు. రాహుల్ రాజీనామాను ఆమోదించినట్లు లోక్‌సభ సచివాలయం బులిటెన్ విడుదల చేసింది. దీంలో లోక్‌సభలో కాంగ్రెస్ బలం 99కి తగ్గింది. వాస్తవానికి కాంగ్రెస్ 99 సీట్లే గెలుచుకుంది. కానీ మహారాష్ట్ర నుంచి ఎన్నికైన రెబల్ అభ్యర్థి కాంగ్రెస్‌కే మద్దతు ఇవ్వడంతో పార్టీ బలం 100కు చేరుకుంది. రాహుల్ రాజీనామాతో మళ్లీ 99కి తగ్గింది.