మొదటి ఫలితం సీఎం రంగస్వామికే.. ప్రత్యర్థిపై స్పష్టమైన మెజారిటీతో విక్టరీ!
CM N Ranga Swamy : కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అధికార ఎన్డీఏ (NDA) కూటమి తన హవాను చాటుకుంటోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ, సీఎం రంగస్వామి నేతృత్వంలోని ఏఐఎన్ఆర్సీ-బీజేపీ కూటమి క్లీన్ స్వీప్ దిశగా దూసుకుపోతోంది.
బోణి కొట్టిన సీఎం..
ఈ ఎన్నికల్లో వెలువడిన మొట్టమొదటి ఫలితంతో ముఖ్యమంత్రి రంగస్వామి విజయకేతనం ఎగురవేశారు. తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన తన సమీప ప్రత్యర్థి వినాయగం (నేయం మక్కల్ కజగం) పై భారీ మెజారిటీతో విజయం సాధించారు. రంగస్వామి పోటీ చేసిన రెండో స్థానం మంగళంలోనూ ఆయన స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతుండటం గమనార్హం.
ఇవి కూడా చదవండి
ఎన్డీఏ కూటమి ఏకంగా 22 స్థానాల్లో..
పుదుచ్చేరి అసెంబ్లీలోని మొత్తం 30 స్థానాలకు గానూ, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 16. అయితే, తాజా ట్రెండ్స్ ప్రకారం ఎన్డీఏ కూటమి ఏకంగా 22 స్థానాల్లో ముందంజలో ఉండి అధికారాన్ని సుస్థిరం చేసుకుంది.
కాంగ్రెస్ కేవలం 6 స్థానాలకే..
ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమి కేవలం 6 స్థానాలకే పరిమితమై దారుణమైన ఫలితాలను మూటగట్టుకుంది. ఇతరులు ఒక స్థానంలో ముందంజలో ఉన్నారు.
ప్రజా వ్యతిరేకతను అధిగమించి రంగస్వామి నేతృత్వంలోని కూటమి మళ్లీ పీఠాన్ని దక్కించుకోవడంతో ఎన్డీఏ శ్రేణులు పుదుచ్చేరి వ్యాప్తంగా సంబరాల్లో మునిగిపోయాయి. ఏకపక్షంగా సాగుతున్న ఈ ఫలితాల సరళిని చూస్తుంటే పుదుచ్చేరిలో మరోసారి రంగస్వామి పాలన ఖాయమని స్పష్టమవుతోంది.








