రాష్ట్రపతి ముర్ముకు మమత బెనర్జి క్షమాపణలు
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును తాను క్షమాపణ కోరుతున్నానని పశ్చిమమెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జి వ్యాఖ్యానించారు. నబన్నాలో ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రపతి చాలా మంచి మహిళ, అఖిల్‌గిరి చేసింది తప్పు. నేను క్షమాపణ కోరుతున్నా. మా ఎమ్మెల్యే తరపున నేను క్షమాపణ కోరుతున్నా ఐయామ్ సారీ అని ఆమె తెలిపారు. ఈస్ట్ మిడ్నాపూర్‌లోని రామ్‌నగర్‌కు చెందిన ఎమ్మెల్యే బెంగాల్ జైళ్ల శాఖ మంత్రి అఖిల్‌గిరి గత వారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురించి అవమానకర వ్యాఖ్యలు చేశారు. నందిగ్రామ్‌లో బెంగాల్ బీజేఎల్పీ నేత సువేందు అధికారిపై విమర్శలు చేస్తూ అఖిల్‌గిరి నోరుజారారు. సువేందు అధికారిని ఉద్దేశించి మేం మనుషుల రుపు చూసి జడ్జి చేయం. రాష్ట్రపతి కుర్చీని గౌరవిస్తాం. కానీ మీ రాష్ట్రపతి చూడ్డానికి ఎలా ఉంది? అని వ్యాఖ్యానించారు.
కాగా, అఖిల్‌గిరి వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో ఆయన రాష్ట్రపతికి క్షమాపణలు చెప్పారు. తాజాగా నబాన్నాలో ప్రెస్ మీట్ పెట్టి మరీ మమతాబెనర్జి కూడా రాష్ట్రపతి క్షమాపణలు తెలియజేశారు. మా పార్టీలో ఎవరైనా పోరపాటు చేస్తే తాము వ్యతిరేకిస్తామని అన్నారు. అలాంటి వాటిని తాము సహించమని తెలిపారు.













