భారత్ లో మళ్లీ చిరుత పరుగు..

భారతదేశంలో చిరుతపులి చివరి సారిగా 1947లో ఛత్తీస్‍గఢ్‍లో కనిపించింది. దేశంలో చిరుతలు అంతరించి పోయాయి అని ప్రభుత్వం 1952లో ప్రకటించింది. 70 ఏళ్ల తర్వాత భారత్‍లో చిరుతలు మళ్లీ కనిపించనున్నాయి. నవంబర్‍లో మధ్యప్రదేశ్‍లోని కునో నేషనల్ పార్కులో చిరుతలను తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఆ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి విజయ్ షా తెలిపారు. ప్రాజెక్టు చీతా కింద దక్షిణాఫ్రికా నుంచి 10 చిరుత పులులను ఇండియాకు తీసుకురానున్నారు. చిరుత పులులను తిరిగి ఇండియాలో ప్రవేశపెట్టేందుకు వైల్డ్ లైఫ్ ఇన్‍స్టిట్యాట్ ఆఫ్ ఇండియా కొన్నేండ్లుగా ప్రయత్నిస్తున్నది.