చాట్ బాట్ లో కొత్త ఫీచర్ …
గూగుల్ తమ కృత్రిమ మేధ చాట్‌బాట్ జెమిని లో కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ప్రాంప్ట్‌లకు అనుగుణంగా అది ఇచ్చే సమాధానాల్లో స్వల్ప మార్పులు చేసుకునేందుకు వీలుగా దీన్ని రూపొందించింది. టెక్ట్స్‌లోని నిర్దిష్ట భాగాన్ని ఎంచుకొని దాన్ని మార్చడం, తొలగించడం వంటివి చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ ఫీచర్ వెబ్ వెర్షన్, ఇంగ్లిష్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. జెమిని సమాధానాలను మరింత మెరుగుపర్చడానికి ఓ నిర్దిష్టమైన మార్గాన్ని ప్రవేశపెడుతున్నాం. జెమిని వెబ్ వెర్షన్లో ఇంగ్లిష్తో దీన్ని ప్రారంభిస్తున్నాం. మార్చాలనుకుంటున్న టెక్ట్స్ భూగాన్ని ఎంచుకొని కావాల్సిన విధంగా సూచనలు ఇవ్వాలి. మీరు వెతుకుతున్న దానికి దగ్గరగా ఉండే అవుట్‌పుట్ అందుతుంది అని గూగుల్ ఓ బ్లాగ్ పోస్టులో వెల్లడిరచింది. ఆశించిన సమాధానం రానప్పుడు టెక్ట్స్ మొత్తాన్ని తిరిగి పొందడానికి బదులు కావాల్సిన చోట మార్పులు చేస్తే సరిపోతుందని తెలిపింది.













