విదేశాల నుంచి వచ్చే వారిని…తప్పనిసరిగా
ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ ముప్పు పెరుగుతున్న నేపపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ సెక్రెటరీలు, ప్రిన్సిపల్ సెక్రెటరీలు, ఆరోగ్యశాఖ కార్యదర్శులకు లేఖ రాశారు. మంకీపాక్స్ విషయంలో ఆరోగ్యమంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను అనుసరిస్తూ అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. విదేశాల నుంచి వచ్చే వారిని తప్పనిసరిగా పరీక్షించాలని కోరారు. ఆరోగ్య అధికారులందరికీ క్రమం తప్పకుండా ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.













