22 నుంచి పార్లమెంట్ సమావేశాలు.. 23న బడ్జెట్

సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించి, నరేంద్ర మోదీ నేతృత్వంలో మూడోసారి ఎన్డీయే కూటమి కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఈ కొత్త ప్రభుత్వం జులై 23న బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. 2024`25 ఆర్థిక సంవత్సరానికిగానూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించనున్నారు. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడిరచారు. ఈ నేపథ్యంలో జులై 22 నుంచి ఆగస్టు 12 వరకు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని తెలిపారు.