రిపబ్లిక్ డే ముఖ్య అతిధి ఎవరో తెలుసా?
భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు (జనవరి 26, 2021) ముఖ్య అతిథిగా బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సస్ హాజరుకానున్నారు. నవంబర్ 27న జాన్సన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ జరిపిన ఫోన్ సంభాషణల్లో ఆయన్ను రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమచారం. కరోనా నేపథ్యంలో ఈసారి 50 శాతం మేర వీక్షకుల పాస్‌లను తగ్గిచింది. పాఠశాల విద్యార్థులకు వేడుకల్లో పాల్గొనే అవకాశం లేదు. ఆలాగే ఆయా రాష్ట్రాల శకటాలను ప్రభుత్వం తగ్గించింది. కరోనా కారణంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.













