బీజేపీ అనూహ్య నిర్ణయం.. ఠాక్రే వర్గానికి లైన్ క్లియర్
మహారాష్ట్రలో బీజేపీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. తాను వెనక్కి తగ్గి ఉద్దవ్ ఠాక్రే వర్గానికి లైన్ క్లియర్ చేసింది. ఈ పరిణామం అంధేరీ ఈస్ట్ ఉప ఎన్నిక విషయంలో చోటు చేసుకుంది. ఆ పోటీ నుంచి తన అభ్యర్థి ముర్జీపటేల్ను ఉపసంహరించుకుంది. పలువురు ప్రముఖ నేతల అభ్యర్థలను పరిగణనలోకి తీసుకున్న కాషాయ పార్టీ ఈ మేరకు నిర్ణయించింది. ప్రస్తుతం రుతుజా లట్కే అంధేరీ ఈస్ట్ నుంచి బరిలో ఉన్నారు. ఆమె భర్త రమేశ్ లట్కే మరణించడంతో ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో ఆమెకు వ్యతిరేకంగా అభ్యర్థిని బరిలో దింపకూడదని మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేవ చీఫ్ రాజ్ ఠాక్రే నిర్ణయించారు.













