రాజ్యసభ సభ్యుడిగా జేపీ నడ్డా ప్రమాణం
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా పెద్దల సభకు నామినేట్ అయిన విషయం తెలిసిందే. రాజ్యసభ సభ్యుడిగా నడ్డా ప్రమాణం చేశారు. నడ్డాతో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ప్రమాణం చేయించారు. కాగా, గతంలో నడ్డా హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. ఆయన పదవీ కాలం ఈ నెల (ఏప్రిల్)తో ముగిసింది. ఈ ఏడాది ఏప్రిల్లో పదవీకాలం ముగిసిన 57 మంది రాజ్యసభ సభ్యుల్లో ఆయన ఒకరు. దీంతో నెల ముందే ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో ఆయన్ని బీజేపీ ప్రభుత్వం గుజరాత్ నుంచి రాజ్యసభకు నామినేట్ చేసింది. ఈ క్రమంలో ఆయన రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.













