బీజేపీ జాతీయ అధ్యక్షుడికి షాక్…
పశ్చిమబెంగాల్లో పర్యటిస్తున్న బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై కొందరు రాళ్లదాడికి పాల్పడ్డారు. కోల్‌కతాలోని డైమండ్ హార్బర్‌కు వెళ్తుండగా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు అనుమానిస్తున్నవారు రహదారిని నిర్బంధించి నడ్డా కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. వారు వాహనాలపై రాళ్లు, కర్రలతో దాడి చేసినట్లు బీజేపీ బెంగాల్ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారులే ఈ దాడికి పాల్పడినట్లు ఆరోపించారు. ఈ ఘటనలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్ వర్గియా కారు ధ్వసంమైనట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీజేపీ బెంగాల్ తన ట్విటర్ ఖాతోలో పోస్ట్ చేసింది.













