మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే
సార్వత్రిక ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్లో వచ్చినా ఆశ్చర్యం లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ అన్నారు. టీఎంసీ యువజన విభాగం వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటికే ప్రచారం కోసం అన్ని హెలికాప్టర్లను కాషాయ పార్టీ ముందస్తుగా బుక్ చేసుకొందన్నారు. మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే నిరంకుశ పాలనేనని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లో సీపీఎం పాలనకు ముగింపు పలికాం. లోక్సభ ఎన్నికల్లో బీజేపీని తప్పకుండా ఓడిస్తామన్నారు. ఇప్పటికే అన్ని వర్గాల్లో చీలిక తెచ్చే ప్రయత్నం ఆ పార్టీ చేస్తోంది. మరోసారి అధికారం చేపడితే పరిస్థితులు దారుణంగా ఉంటాయి అని అన్నారు. గవర్నర్ పదవి అంటే తనకు గౌరవం ఉన్నప్పటికీ ఆయన తీరు మాత్రం బాగాలేదన్నారు.













