శబరిమల కిటకిట… ఒక్క రోజే రికార్డు స్థాయిలో
కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. ఒక్క రోజే రికార్డు స్థాయిలో 1,19,480 మంది భక్తులు దర్శనం కోసం ముందస్తు బుగింగు చేసుకున్నారు. ఈ సీజనులో ఇదే అత్యధికం కాగా, లక్ష మార్కు దాటడం రెండోసారి. గత రెండేళ్లుగా రోజుకు 30 వేల మంది భక్తులనే అనుమతించారు. ఈ ఏడాది అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్యపై ఎటువటి పరిమితులు లేవు. దీంతో నిత్యం భారీ సంఖ్యలో అయ్యప్ప భక్తులు ఆలయ సందర్శనకు బారులు తీరుతున్నారు. రోజుకు గరిష్టంగా 90 వేల మంది భక్తులను అనుమతించాలని, దర్శన వేళలు ఓ గంట పొడిగించాలని కేరళ ముఖ్యమంత్రి పినరియ విజయన్ అధికారులను ఆదేశించారు.













