ఈసారి సూపర్ స్టార్ రజనీకాంత్ కు
వివిధ రంగాల ప్రముఖులకు భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్ ప్రత్యేక అతిథిగా వీక్షించేందుకు బీసీసీఐ గోల్డెన్ టిక్కెట్లను ఇస్తోంది. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, సచిన్ టెండ్యూలర్లకు అందించగా, తాజాగా తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఈ గౌరవాన్ని అందుకున్నాడు. చెన్నైలోని ఆయన స్వగృహంలో బోర్డు కార్యదర్శి జైషా ఈ టిక్కెట్‌ను అందించాడు. వన్డే వరల్డ్‌కప్‌లో తలైవా రజనీకాంత్ మా విశిష్ట అతిథి కాబోతున్నందుకు ఆనందంగా ఉంది అని బీసీసీఐ పేర్కొంది. మెగా టోర్నీకి మరింత ప్రచారం కల్పించే ఎత్తుగడలో భాగంగా బోర్డు ఈ గోల్డెన్ టిక్కెట్లను ఇస్తోంది. ఇవి అందుకున్న వారికి వీఐపీ ట్రీట్మెంట్ లభించనుంది. వరల్డ్ కప్ అక్టోబర్ 5 నుంచి జరగనుంది.













