బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన బండి
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ను పార్టీ అధిష్టానం తొలగించిన విషయం తెలిసిందే. రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో బండి సంజయ్‌ను జాతీయ ప్రధాన కార్యదర్విగా నియమించడంతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలోని తన కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు.













