బద్రీనాథ్ ఆలయం మూసివేత
పవిత్ర చార్ధామ్ యాత్ర గురువారం ముగిసింది. సంప్రదాయ పూజల అనంతరం ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ఆలయ ద్వారాలను గురువారం మద్యాహ్నం 3:35 గంటలకు మూసివేయడంతో ఈ ఏడాది జరిపిన చార్ధామ్ యాత్రకు తెరపడింది. చార్‌ధామ్‌గా పిలిచే కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్ పుణ్యక్షేత్రాలను శీతాకాలంలో మంచు కప్పివేస్తుండటంతో ఈ ఆలయాలను మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇదివరకే మిగిలిన మూడు ఆలయాలను మూసివేసిన విషయం తెలిసిందే. ఈ యాత్రంలో 1.45 లక్షలకు పైగా భక్తులు బద్రీనాథ్‌ని దర్శించుకున్నట్లు చార్ధామ్ దేవస్థానం బోర్డు తెలిపింది.













