నా భర్తను వేధిస్తున్నారు.. కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
మద్యం విధానం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై అరెస్టయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆయన సతీమణి సునీత ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనను అధికారులు తీవ్రంగా వేధిస్తున్నారని ఆరోపించారు. కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరుపరిచేందుకు ఈడీ అధికారులు తీసుకురాగా అక్కడికి వచ్చిన సునీత మీడియాతో మాట్లాడారు. తన భర్త ఆరోగ్యం బాగా లేదని, చక్కెరస్థాయిలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈడీ అధికారులు తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. ఈ దౌర్జన్యం ఎంతోకాలం సాగదని, ప్రజలే తగిన సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు.













