విశ్వాస పరీక్షలో నెగ్గిన కేజ్రీవాల్ ప్రభుత్వం
ఢిల్లీ అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షల్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం నెగ్గింది. విశ్వాస పరీక్షలో కేజ్రీవాల్‌కు మద్దతుగా 58 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. ఢిల్లీ అసెంబ్లీలో 70 స్థానాలు ఉన్నాయి. అందులో 62 మంది ఆప్ ఎమ్మెల్యేలు ఉండగా, బీజేపీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అనంతరం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రతిపక్ష బీజేపీ పన్నిన ఆపరేషన్ కమలం విఫలమైందన్నారు. ఢిల్లీలో ఒక ఆప్ ఎమ్మెల్యేను కొనుగోలు చేయడంలో కూడా బీజేపీ విజయం సాధించలేదన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు నిజాయితీ పరులని, ఒక్క ఎమ్మెల్యే కూడా అమ్మడుపోలేదని స్పష్టం చేశారు. తమకు అసెంబ్లీలో 62 మంది ఎమ్మెల్యేల బలంగా ఉండగా, ఇద్దరు విదేశాల్లో ఉన్నారని, ఓ సభ్యుడు జైల్లో ఉన్నాడని అన్నారు. మరో సభ్యుడు శాసనసభ స్పీకర్ అని తెలిపారు.













