త్వరలో దేశానికి మంచిరోజులు : కేజ్రీవాల్

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తన భార్య సునీత కేజ్రీవాల్ ను ఝాన్సీ రాణితో పోల్చారు. ఢిల్లీలోని గాంధీనగర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో సభలో తొలిసారి తన భార్యతో కలిసి కేజ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెను ప్రశంసిస్తూ ఝాన్సీ కి రాణి అంటూ సంబోధించారు. ఈరోజు నాతోపాటు నా భార్య కూడా వెంట తీసుకొచ్చా. నేను లేని సమయంలో ఆమె అంతా తానై నడిపించారు. నేను జైల్లో ఉన్నప్పుడు నన్ను తరచూ కలిసేందుకు వచ్చేవారు. ఆమె ద్వారా ఢిల్లీ ప్రజల యోగక్షేమాలు తెలుసుకునేవాడిని. వారికి నా సందేశాలు పంపేవాడిని. ఆమె రaాన్సీ కి రాణి వంటివారు అని పేర్కొన్నారు. త్వరలో దేశానికి మంచి రోజులు రాబోతున్నాయని, మోదీ వెళ్లిపోతున్నారని సందర్భంగా కేజ్రీవాల్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. విపక్ష కూటమికి ఈ ఎన్నికల్లో 300 సీట్లకు పైగా వస్తాయని జోష్యం చెప్పారు.