అమర్నాథ్ యాత్ర పున: ప్రారంభం
ప్రతికూల వాతావరణం కారణంగా మూడు రోజులుగా రద్దయిన అమర్నాథ్ యాత్ర తిరిగి ప్రారంభమైంది. జమ్ములోని భగవతి నగర్ యాత్రి నివాస్ నుంచి 4,020 మది భక్తులతో 110 వాహనాలు గట్టి బందోబస్తు మధ్య బేస్ క్యాంపులకు బయల్దేరినట్లు సైనిక వర్గాలు ప్రకటించాయి. వీరంత అమర్నాథ్ మంచు లింగాన్ని దర్శించుకుంటారు. యాత్రికులు బస చేయడానికి ఎంపిక చేసిన ప్రదేశం సరైనది కాకపోవడం వల్లనే ప్రాణ నష్టం వాటిల్లిందన్న విమర్శల్ని జమ్ము రాజ్‌భవన్ అధికార ప్రతినిధి ఖండిరచారు. గతంలో మెరపు వరదలు సంభవించిన ప్రాంతాలను గమనంలోకి తీసుకున్న తర్వాతే శిబిరాలకు సంబంధించిన ప్రణాళిక ఖారారైందని శుక్రవారం నాటి పరిస్థితి మునుపెన్నడూ తలెత్తలేదని వివరించారు.













