అమర్నాథ్ యాత్ర పున: ప్రారంభం
ప్రతికూల వాతావరణం, ఆకస్మిక వరదల కారణంగా రద్దయిన అమర్నాథ్ యాత్ర తిరిగి ప్రారంభమైంది. మంచు శివలింగం దర్శనానికి 4,020 మంది భక్తులతో కూడిన 12వ బ్యాచ్ బయలుదేరినట్లు అధికారులు వెల్లడించారు. జమ్ములోని భగవతినగర్ యాత్రి నివాసం నుంచి 110 వాహనాలు గట్టి బందోబస్తు మధ్య బేస్ క్యాంపులకు బయలుదేరినట్లు సైనికవర్గాలు ప్రకటించాయి. వారిలో 1016 మంది తెల్లవారుజామున 3:30 సమయంలో 35 వాహనాల్లో బాల్తాల్ బేస్ క్యాంపునకు బయలుదేరినట్లు తెలిపారు. మరో 2,425 మంది 75 వాహనాల్లో పెహల్గామ్ బేస్ క్యాంపునకు బయలుదేరినట్లు పేర్కొన్నారు. ఈ ఉదయం ఆ మార్గంలోని నున్వాన్ బేస్ క్యాంప్ నుంచి యాత్రికుల బృందం వెళ్లిందని అధికారులు తెలిపారు.













