జూన్ 29 నుంచి అమర్‌నాథ్ యాత్ర … నేటి నుంచి

ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర జూన్ 29 నుంచి ప్రారంభం కానున్నట్లు ఆలయ బోర్డు ప్రకటించింది. 52 రోజుల పాటు నిర్వహించే ఈ యాత్ర కోసం ఈ నెల 15 ( సోమవారం) నుంచి రిజిస్ట్రేషన్లను ప్రారంభించనున్నట్లు తెలిపింది. దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయ పర్వత ప్రాంతంలో 3,800 మీటర్ల ఎత్తులో ఉండే ఈ పుణ్యక్షేత్రాన్ని ఏటా భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు.