అన్నాడీఎంకే కీలక నిర్ణయం.. మళ్లీ తాము
తమిళనాడు లో బీజేపీకి కటీఫ్ చెప్పి ఎన్డీయే నుంచి వైదొలగిన అన్నాడీఎంకే పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రత్యేక ఫ్రంట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. బీజేపీతో నాలుగేళ్ల బంధానికి గుడ్‌బై చెప్పిన మూడు రోజుల అనంతరం ఈ నిర్ణయం ప్రకటిచింది. తమ పార్టీ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన తనయుడు ఉదయనిధి స్టాలిన్ డ్రామాగా పేర్కొంటున్నారని, మళ్లీ తాము బీజేపీతో పొత్తు పొట్టుకొనే అవకాశమే లేదని అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి కేపీ మునుస్వామి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలైని తొలగించాలని తాము కోరడం లేదన్నారు. అన్నాడీఎంకే లాంటి పెద్ద పార్టీ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని తొలగించాలని కోరడం చిన్నతనం అవుతుందన్నారు. తాము అలాంటి తప్పు ఎప్పుడూ చేయబోమని పేర్కొన్నారు.













