ఫొటోలు తీస్తే 2వారాల సస్పెన్షన్
నిబంధనలకు విరుద్ధంగా విమానంలో ఎవరైనా ఫొటోలు తీస్తే రెండువారాల పాటు ఆ విమాన సేవలను నిలిపివేస్తామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) హెచ్చరించింది. నిబంధనలు పాటించని వ్యక్తిపై విమానయాన సంస్థ తగిన చర్యలు తీసుకున్న తర్వాతనే తిరిగి ప్రయాణాలకు అనుమతిస్తామని చెప్పింది. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చంఢీగడ్ నుంచి ముంబైకి వస్తున్న క్రమంలో ఇండిగో విమానంలో మీడియా ప్రతినిధులు ఫొటోలు, వీడియోలతో అత్యుత్సాహం ప్రదర్శించారు. దీనిపై డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇండిగో సంస్థను వివరణ కోరింది.













