టీ20 ప్రపంచ కప్ ఫై కూడా కరోనా ప్రభావం…

భారత్‍లో జరగనున్న టి20 ప్రపంచకప్ మీద కూడా కరోనా ప్రభావం పడినట్లే కనిపిస్తోంది. అక్టోబర్-నవంబర్ నెలలో భారత్ వేదికగా జరగాల్సిన ఈ మెగా టోర్నీకి నిర్వహాణకు ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు దేశంలో కరోనా కేసులో రోజుకు లక్షకుపైగా దాటిపోవడంతో ఈ పరిస్థితుల్లో ఈ మెగాటోర్నీ జరుగుతుందా లేదా అన్న విషయమై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కరోనా వల్ల ఐపిఎల్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. టీ 20 వరల్డ్కప్‍లో దాదాపు 16 జట్లు పాల్గొనే అవకాశం ఉంది. ఆటగాళ్ళు భారత్ వచ్చే విషయంలో ప్రతీ దేశం తమవారికి ఆంక్షలు పెడుతోంది. ఇప్పటికే పలు దేశాలు భారత్ విమానాలపై నిషేధం విధించాయి. టీ20 వరల్డ్ కప్‍కు ఆరు నెలల సమయం ఉండడంతో అప్పటివరకు పరిస్థితులు కుదలటపడుతాయి అనుకున్నప్పటికి క్రికెటర్లలో ఆందోళన పూర్తిగా తొలగివచ్చునని బీసీసీఐ భావిస్తోంది.ఐపీఎల్ 2021లో కూడా చాలా మంది విదేశీ క్రికెటర్లు భయందోళన మధ్యే క్రికెట్ ఆడిన విషయం తెలిసిందే. కుటుంబాలు వారి పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. చివరకు బయో బబుల్‍లో ఉన్నప్పటికి క్రికెటర్స్ కరోనా సోకడంతో ఐపీఎల్ వాయిదాకు కారణమైంది.
ప్రస్తుత పరిస్థితులు చూస్తే టీ20 వరల్డ్ కప్ కూడా వాయిదా పడే పరిస్థితి కనిపిస్తుంది. ఇండియాలో ప్రపంచ కప్ సాధ్యం కాకపోతే టీ-20 ప్రపంచకప్‍ను యూఏఈకి తరలించేందుకు ఇప్పటికే బోర్డు పెద్దలు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించారని వినికిడి. ప్రభుత్వం సైతం ఇందుకు అంగీకరించిందనే సమాచారం. నాలుగు వారాల్లోనే ఐపీఎల్‍ను వాయిదా వేయడం అంతర్జాతీయ మెగా టోర్నీ నిర్వహణకు సురక్షితం కాదన్న సంకేతాలు పంపించింది. దేశం గతంలో ఎన్నడూ చూడని ఆరోగ్య విపత్తును చవిచూస్తోంది. నవంబర్ మాసంలో భారత్‍లో మూడో వేవ్ ఉంటుందని అంచనా. ఆతిథ్యం బీసీసీఐదే అయినప్పటికీ టీ-20 ప్రపంచకప్ టోర్నీని యూఏఈకి తరలించాలన్నది ఆలోచన అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.