ఈ నెల 16న సీఎంగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం!
పంజాబ్‌లో ఆప్ ఘన విజయం సాధించడంలో ముఖ్యమంత్రి పదవికి లైన్ క్లియన్ చేసుకున్న ఆప్ నేత భగవంత్ మాన్. అయితే పంజాబ్ ముఖ్యమంత్రి ఈ నెల 16న ప్రమాణ స్వీకారం చేస్తారని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నారు. రాజ్ భవన్లో కాకుండా భగత్ సింగ్ పుట్టిన ఖత్కర్ కాట్లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని ఎన్నికల ఫలితాల విడుదల అనంతరమే భగవంత్ మాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రమాణ స్వీకార తేదీ కూడా ప్రకటించడంతో ఖత్కర్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 92 స్థానాలను దక్కించుకుని విజయ కేతనం ఎగురవేయగా, కాంగ్రెస్ పార్టీ కేవలం 18 స్థానాలకు పరిమితమైంది. శిరోమణి అకాలీద్ (ఎన్ఏడీ) మూడు స్థానాలు, బీజేపీ కేవలం 2 స్థానాల్లో గెలుపొందాయి.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం కావడంతో ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ తన పదవికి రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌కు వెళ్లి చన్నీ గవర్నర్‌కు రాజీనామా పత్రాలను అందచేశారు. నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు పదవిలో కొనసాగాలని గవర్నర్ కోరారు. తాము చేపట్టిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను కొనసాగించాలని కొత్త ప్రభుత్వాన్ని కోరారు. పంజాబ్ ప్రజలకు సేవ చేసేందుకు తాము సిద్ధంగా ఉంటామని తెలిపారు.













