Piyush Goyal: భారత్-అమెరికా ట్రేడ్ డీల్‌పై త్వరలోనే ఉమ్మడి ప్రకటన: పీయూష్ గోయల్
భారత్, అమెరికా మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన కీలక ఘట్టం మరో 4-5 రోజుల్లో ఆవిష్కృతం కానుంది. ఈ మేరకు ఇరు దేశాలు ఉమ్మడి ప్రకటన (Joint Statement) విడుదల చేయనున్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) వెల్లడించారు. ఈ ఒప్పందంలో భాగంగా అమెరికా నుండి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాల తగ్గింపు, భారతీయ ఎగుమతులపై టారిఫ్‌ల సడలింపు వంటి ప్రధాన అంశాలు ఉంటాయని సమాచారం.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ప్రస్తుతం జాయింట్ స్టేట్మెంట్కు సంబంధించిన ప్రక్రియ తుది దశలో ఉందని, ఇది పూర్తయిన తర్వాత మార్చి మధ్య నాటికి పూర్తిస్థాయి చట్టపరమైన ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉందని గోయల్ (Piyush Goyal) తెలిపారు. ఈ ఒప్పందంలో భారతీయ వ్యవసాయం, డెయిరీ వంటి సున్నితమైన రంగాలకు పూర్తి రక్షణ కల్పించినట్లు ఆయన పునరుద్ఘాటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇప్పటికే భారతీయ ఉత్పత్తులపై టారిఫ్‌ను 18 శాతానికి తగ్గిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ ఒప్పందం ద్వారా ఎంఎస్ఎంఈలు (MSMEs), టెక్స్టైల్స్, లెదర్, జెమ్స్ & జ్యువెలరీ రంగాలు భారీగా లబ్ధి పొందుతాయని, ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్య సాధనకు ఇది దోహదపడుతుందని మంత్రి (Piyush Goyal) ధీమా వ్యక్తం చేశారు. విపక్షాలు చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదని, ఇది దేశ ప్రయోజనాలను కాపాడే ‘బెస్ట్ డీల్’ అని ఆయన స్పష్టం చేశారు.






