నితీశ్ కుమార్ కు ఊహించని షాక్..
మణిపూర్‌లో మొత్తం ఆరుగురు జేడీయూ ఎమ్మెల్యేల్లో ఐదుగురు బీజేపీలో విలీనమయ్యారు. స్పీకర్ ఆమోదంతో అధికారికంగా ఈ ప్రక్రియ పూర్తయింది. ఏన్డీఏతో తెగదెంపులు చేసుకున్న వారాల వ్యవధిలోనే ఈ పరిణామం జరగడం బిహార్ సీఎం నితీశ్ కుమార్‌కు షాకే అని చెప్పాలి. ఎమ్మెల్యే చేరిక అనంతరం బీజేపీ ఎంపీ సుశీల్ మోదీ నితీశ్‌పై విమర్శలు గుప్పించారు. మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లు జేడీయూ ముక్త్ రాష్ట్రాలు అవతరించాయని పేర్కొన్నారు. బిహార్ రాజధాని పాట్నాలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముందే ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరడం గమనార్హం. నితీశ్ కుమార్‌కు బీజేపీ షాక్ ఇవ్వడం తొమ్మిది రోజుల్లో ఇది రెండోసారి.













