తమిళనాడులో బీజేపీకి షాక్…. కీలక నేతలు
తమిళనాడులో బీజేపీకి ఆ పార్టీ కీలక నేతలు షాక్ ఇచ్చారు. బీజేపీకి చెందిన 13 మంది కీలకనేతలు ఆ పార్టీని వీడి అన్నా డీఎంకేలో చేరడం విశేషం. మాజీ సీఎం పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే తమ పార్టీ నేతలకు ఎర వేస్తున్నదని ఓ వైపు బీజేపీ ఆరోపిస్తుండగానే తాజాగా ఈ పరిణామం చోటు చేసుకోవడం విశేషం. బీజేపీ వీడిన 13 మంది నేతలు పశ్చిమ చెన్నైలోని ఐటీ విభాగానికి చెందినవారు. తాము బీజేపీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నానని, ఎలాంటి పదవులును ఆశించలేదని, అయితే పార్టీలో గత కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు తనను పార్టీని వీడేలా చేశాయని బీజేపీ ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు అంబరాజన్ ఒక ప్రకనటలో పేర్కొన్నారు. అంబరాజన్తో పాటు బీజేపీ వీడిన వారిలో 10 మంది ఐటీ వింగ్ జిల్లా కార్యదర్శులు, ఇద్దరు ఐటీ వింగ్ డిప్యూటీ కార్యదర్శులు ఉన్నారు.













