అయోధ్య రామయ్యకు కానుకగా.. ఢమరుకం
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య బాలరాముడికి మధ్యప్రదేశ్‌కు చెందిన శివ బరాత్ జన్ కల్యాణ్ సమితి బృందం 1,100 కిలోల ఢమరుకాన్ని కానుకగా సమర్పించింది. దీనిని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అందజేసింది. ఈ తబలాను వాయించినప్పుడు దీని శబ్దం కొన్ని కిలోమీటర్ల వరకు వినిపిస్తుందని నిర్వాహకులు తెలిపారు. దీనికి ఇప్పటికే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా చోటు దక్కిందని చెబుతున్నారు. ఇది 6 అడుగుల ఎత్తు, 33 అడుగుల వెడల్పు ఉంది. మరోవైపు ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన కొందరు రామ భక్తులు 6.9 అడుగుల ఫ్లైవుడ్‌పై హనుమాన్ చాలీసాను చెక్కి అయోధ్యకు తీసుకువచ్చారు.






