అందరిలాగే ఇకపై డిసెంబర్ 25న : ఉక్రెయిన్
రష్యా దండయాత్రతో ఆ దేశంతో శత్రుత్వం మరింత పెంచుకున్న ఉక్రెయిన్ రష్యాతో పాటు అనుసరిస్తున్న రోమన్లకాలంనాటి జూలియన్ క్వాలెండర్ను పట్టించుకోవద్దని నిర్ణయించుకుంది. ప్రపంచంలో అత్యధిక క్రైస్తవ మెజారిటీ దేశాలు పాటించే గ్రెగోరియన్ క్యాలెండర్ను ఇకపై అనుసరించాలని తుది నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన చట్టానికి ఈ జులై నెలలోనే దేశాధ్యక్షుడు జెలెన్స్కీ ఆమోద ముద్ర వేశారు. దీని ప్రకారం ఈ ఏడాది తొలిసారిగా డిసెంబర్ 25వ తేదీనే క్రిస్మస్ వేడుకలు ఉక్రెయిన్ అంతటా జరిగాయి. దేశంలో డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ వేడుకలు జరగడం వందేళ్లలో ఇదే తొలిసారి. ఇన్నాళ్లూ రష్యాతోపాటు జూలియన్ క్యాలెండర్ను అనుసరిస్తూ జనవరి ఏడో తేదీన క్రిస్మస్ను జరుపుకుంది. ఈ సంవత్సరంతో ఉక్రెయిన్ కొత్త సంప్రదాయానికి తెరతీసింది.













