20 ఏండ్ల క్రితం కుదుర్చుకున్న ఒప్పందాన్ని… పొడిగించిన దేశాలు

ఇరు దేశాల మధ్య 20 ఏండ్ల క్రితం కుదుర్చుకున్న ట్రీటీ ఆఫ్ గుడ్-నైబర్‍లైన్స్ అండ్ ఫ్రెండ్లీ కో ఆపరేషన్ (టీజీఎన్‍ఎఫ్‍సీ) ఒప్పందాన్ని చైనా-రష్యా పొడిగించాయి. ఈ మేరకు ఇరు దేశాల అధ్యక్షులు జిన్‍పింగ్, వ్లాదిమిర్ పుతిన్ సంయుక్త ప్రకటన చేశారు. తాజా నిర్ణయంతో ఇరు దేశాల మధ్యనున్న ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమవుతాయని దేశాధినేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. మానవహక్కుల ఉల్లంఘనలతో పాటు పొరుగు దేశాలతో కయ్యాలకు పాల్పడుతున్నాయంటూ చైనా, రష్యాపై అమెరికా, యూరోపియన్ యూనియన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.