ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు ప్రారంభం
సింగపూర్ వేదికగా తొలి ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు ప్రారంభమయ్యాయి. ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సమావేశాలకు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్, తెలంగాణ ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్, ఒమన్ రాజ కుటుంబీకులు ఫిరాస్ బిన్ పాతిక్, దుబాయ్ మంత్రి అబు అబ్ధుల్లా, ఫ్రాన్స్ మంత్రులు సెబాస్టియన్, జాక్, వెస్టర్న్ యూనియన్ సీఈఓ దేవిన్ మాక్ గ్రణహాన్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రపంచంలోని దాదాపు 80కి పైగా దేశాల నుంచి తెలుగు ఐటీ ప్రతినిధులు ఈ సభకు హాజరయ్యారు. వారం రోజుల పాటు మహాసభలు జరగనున్నాయి.













