ఉక్రెయిన్‌కు ప్రపంచ బ్యాంకు భారీ ప్యాకేజీ
రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఆర్థికంగా ఎంతో నష్టపోయిన ఉక్రెయిన్‌కు ప్రపంచ బ్యాంకు భారీ ప్యాకేజీని ప్రకటించింది. 3 బిలియన్ డాలర్ల ప్యాకేజీకి సిద్ధం చేస్తున్నట్టు ప్రపంచ బ్యాంకు తెలిపింది. ఇందులో కనీసం 350 మిలియన్ డాలర్లను తక్షణ సాయం కింద అందజేసినట్టు వివరించింది. సాయానికి సంబంధించిన తొలి విడతను ఈ వారంలోనే ఆమోదం కోసం బోర్డు ఎదుట ప్రపంచ బ్యాంకు ఉంచనుంది. ఆ తరువాత ఆరోగ్యం, విద్య కోసం 200 మిలియన్ డాలర్లను వెంటనే అందించేందుకు నిర్ణయించినట్టు ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మాల్సాస్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివాలు సంయుక్తంగా ప్రకటించారు.













