ఆయనతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా.. జిన్ పింగ్
చైనా-అమెరికా సంబంధాల్లో కీలక మైలురాయి గురించి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ స్పందించారు. ఇరు దేశాల మద్య ద్వైపాక్షిక బంధానికి నాలుగున్నర దశాబ్దాలు అయిన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. చైనా`అమెరికా సంబంధాల బలోపేతం కోసం జో బైడెన్‌తో కలిసి పనిచేయడానికి సిద్దంగా ఉన్నాం. రెండు దేశాల ప్రజల ప్రయోజనాలు, ప్రపంచ శాంతి, అభివృద్ధి కోసం ఆయనతో కలిసి పనిచేయాలనుకుంటున్నాను అని అన్నారు. రెండు దేశాల మద్య దౌత్య సంబంధాలు నెలకొని 45 సంవత్సరాలు కావొస్తున్న తరుణంలో జిన్‌పింగ్ ఈ సందేశం పంపారు. ఈ సంబంధాలు స్థిరంగా అభివృద్ధి చెందేందుకు రెండు వైపులా చర్యలు తీసుకోవాలని కోరారు..













