జీ20తో కలిసి పని చేస్తాం
ఢిల్లీలో జరిగే జీ20 సదస్సులో సానుకూల ఫలితం రాబట్టేందుకు మిగిలిన సభ్యులతో కలిసి పని చేయడానికి సిద్ధమే అని చైనా ప్రకటించింది. చైనా కారణంగానే వివిధ అంశాలపై ఒప్పందాలు కుదరడంలో జాప్యం జరుగుతోందని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఆరోపించినట్లు తెలిసింది. దీనిపై చైనా విదేశాంగశాఖ ప్రతినిధి మావో నింగ్ స్పందించారు. ఉక్రెయిన్, వాతావరణ మార్పులపై నిర్మాణాత్మక చర్చలకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జీ20కి చైనా అత్యంత ప్రాధాన్యమిస్తుంది. ఢిల్లీ సదస్సులో జరిగే చర్చల్లో పాల్గొంటాం. ఇతర దేశాలతో కలిసి పని చేస్తాం. ఏకాభిప్రాయం సాధించడానికి మా సహకారం ఉంటుంది అని అన్నారు.













