బంగ్లా ప్రధాని కుమార్తెకు కీలక పదవి
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆగ్నేయ ఆసియా ప్రాంత తదుపరి రీజనల్ డైరెక్టర్‌గా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కుమార్తె సైమా వాజెద్ ఎన్నికయ్యారు. ఈ పదవికి సైమా వాజెద్, నేపాల్‌కు చెందిన శంబు ప్రసాద్ ఆచార్య పోటీపడ్డారు. ఢిల్లీలో జరిగిన రీజినల్ కమిటీ సమావేశంలో దీనిపై ఓటింగ్ జరిగింది. వాజెద్‌కు 8 ఓట్లు, ఆచార్యకు 2 ఓట్లు వచ్చాయి. బంగ్లాదేశ్, నేపాల్, భారత్, భూటాన్, ఉత్తర కొరియా, ఇండోనేసియా, మాల్దీవులు, మయన్మార్, శ్రీలంక, థాయ్‌లాండ్, తైమోర్ లెస్తేలు ఈ ప్రాంతీయ కమిటీలో సభ్య దేశాలు.













