భారత సంతతి వ్యక్తి మంచి ప్రధాని అవుతారు.. ఒపీనియన్ పోల్స్!
బ్రిటన్ ప్రధాని రేసులో ఉన్న భారతసంతతి వ్యక్తి రిషి సునాక్కు సానుకూల పవనాలు వీస్తున్నాయి. అక్కడి అధికార కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు జై కొడుతున్నారు. తాజాగా నిర్వహించిన ఒపీనియన్ పోల్లో మెజారిటీ ఓటర్లు రిషి సునాక్ వైపే మొగ్గుచూపారు. రిషి ఎంపికైతే మంచి ప్రధానిగా అయన రాణిస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేసినట్లు ఓపినయన్ పోల్ వెల్లడిరచింది. రిషిని ఎన్నుకుంటే ఓ మంచి ప్రధానిగా ఉండగలరంటూ 48 శాతం (సుమారు 4,400) మంది టోరీ సభ్యులు అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు వెల్లడించింది. రిషికి గట్టిపోటీ ఇస్తున్న విదేశాంగ మంత్రి లీజ్ట్రూజ్ 39 శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు.













