ప్రపంచ దేశాలకు… రష్యా గుడ్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారిపై పోరు కొనసాగుతున్న వేళ ప్రపంచ దేశాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ గుడ్ న్యూస్ చెప్పారు. రష్యా శాస్త్రవేత్తలు స్పుత్నిక్ వీ కొవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి చేయడం తెలిసిందే. ప్రపంచంలో అభివృద్ధి అయిన తొలి కొవిడ్ వ్యాక్సిన్‍గా దీనికి గుర్తింపు ఉంది. పలు ప్రపంచ దేశాలకు ఈ వ్యాక్సిన్లు రష్యా సరఫరా చేస్తోంది. ఇటు భారత్‍లో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ తయారీకి పలు కంపెనీలు సన్నద్ధమవుతున్నాయి. ఇటీవల సీరమ్ ఇన్ట్సిట్యూట్ కూడా భారత్‍లో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసేందుకు డీసీజీఐ అనుమతి పొందింది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ టెక్నాలజీ బదిలీకి సంబంధించిన ప్రపంచ దేశాలకు పుతిన్ తీపి కబురు చెప్పారు. తమ వ్యాక్సిన్ టెక్నాలజీని ఇతర దేశాలకు బదిలీ చేసేందుకు రష్యా సిద్ధమని ఆయన ప్రకటించారు. వ్యాక్సిన్ టెక్నాలజీని పంచుకునేందుకు సిద్దమైన ఏకైక దేశం రష్యాయేనని ఆయన స్పష్టం చేశారు. తద్వారా విదేశాల్లో కూడా స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ఉత్పత్తిని విస్తృతం చేయనున్నట్లు తెలిపారు.